కరీంనగర్ పట్టణంలో జమాతే ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో నిర్వహించిన 'పేదలకు ఉచిత కుట్టు శిక్షణ' శిబిరం ముగింపు కార్యక్రమానికి మేయర్ సునీల్‌రావు హాజరయ్యారు. శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు ప్రశంసా పత్రాలు అందజేశారు.
కుట్టు వృత్తి.. మహిళలకు స్వయం ఉపాధి
పేద మహిళలకు కుట్టు వృత్తి స్వయం ఉపాధిగా ఉపకరిస్తుందని కరీంనగర్ మేయర్ సునీల్ రావు పేర్కొన్నారు. పట్టణంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.
కుట్టు వృత్తి.. మహిళలకు స్వయం ఉపాధి
మహిళల ఆర్థిక స్వావలంబనకు కుట్టు వృత్తి.. ఓ సాధనంగా మారుతుందని మేయర్ పేర్కొన్నారు. శిక్షణ పొందిన వారు.. కుట్టు వృత్తిని కొనసాగించాలని సూచించారు. అర్హులకు ప్రభుత్వం రాయితీ కుట్టుమిషన్లను అందజేస్తుందని వివరించారు.
ఇదీ చదవండి: పది మంది భార్యలు.. కోట్ల ఆస్తి.. దారుణ హత్య!