కరోనా రెండో దశలో జిల్లా వ్యాప్తంగా రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయని కరీంనగర్ మేయర్ సునీల్ రావు తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉంటూ విధిగా మాస్కు ధరించాలని సూచించారు. 30, 36, 41 డివిజన్లలో చేపడుతోన్న పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం నెహ్రు విగ్రహం వద్ద చేపడుతున్న డ్రైనేజీ పనులను పరిశీలించారు.
4 వారాల పాటు స్వీయ నియంత్రణ పాటించండి: మేయర్ - కరీంనగర్ మేయర్ సునీల్ రావు
కరీంనగర్లోని 30, 36, 41 డివిజన్లలో మేయర్ సునీల్ రావు పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. కొవిడ్ కట్టడికి ప్రతి ఒక్కరు సహకరించాలని నగర ప్రజలను కోరారు.
కరీంనగర్ కొవిడ్ కేసులు
ప్రజలు మరో 4 వారాల పాటు బయటకు వెళ్లకుండా స్వీయ నియంత్రణ పాటించాలని మేయర్ సూచించారు. కరోనా కట్టడికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారందరికీ టీకా ఇచ్చేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని వివరించారు.
ఇదీ చదవండి:కరోనా భయంతో రోడ్లపై తగ్గిన రద్దీ