రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కరీంనగర్ నగర పాలక సంస్థ పరిధిలో విజయవంతంగా హరితహారం కార్యక్రమం నిర్వహిస్తున్నామని మేయర్ సునీల్ రావు అన్నారు. హరితహారంలో భాగంగా శాతవాహన విశ్వ విద్యాలయంలో కలెక్టర్ శశాంక, కమిషనర్ క్రాంతితో కలిసి ఆయన మొక్కలు నాటారు.
శాతవాహన విశ్వ విద్యాలయంలో మొక్కలు నాటిన కలెక్టర్, మేయర్ - కరీంనగర్ జిల్లా కలెక్టర్
కరీంనగర్ జిల్లాలో హరితహారం కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందని మేయర్ సునీల్ రావు అన్నారు. హరితహారంలో భాగంగా జిల్లా కలెక్టర్ శశాంక, కమిషనర్ క్రాంతితో కలిసి ఆయన శాతవాహన విశ్వ విద్యాలయంలో మొక్కలు నాటారు.

శాతవాహన విశ్వ విద్యాలయంలో మొక్కలు నాటిన కలెక్టర్, మేయర్
ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే.. అక్కడ్ మొక్కలు నాటాలని నగరపాలక సిబ్బందికి సూచించామని, నాటిన మొక్కలు సంరక్షిస్తూ హరిత కరీంనగర్గా మార్చేందుకు కృషి చేస్తున్నామని మేయర్ తెలిపారు. శ్రద్ధగా హరితహారం నిర్వహిస్తూ.. మొక్కలను సంరక్షించే చర్యలు తీసుకుంటున్న మేయర్ కృషిని కలెక్టర్ శశాంక ప్రశంసించారు. మొక్కలు నాటడమే కాదు..వాటిని సంరక్షించినప్పుడే మన బాధ్యత పూర్తిగా నెరవేర్చినట్టు అని కలెక్టర్ అన్నారు.
ఇదీ చూడండి:చేనేత రంగంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు: కేటీఆర్