తెలంగాణ

telangana

ETV Bharat / state

నిరాశ్రయులకు ఉచిత వైద్య శిబిరం.. పరీక్షలు చేయించిన మేయర్ - కరీంనగర్​ మున్సిపాలిటీ

ఏ దిక్కు లేనివారికి దేవుడే దిక్కు.. నిరాశ్రయులకు ప్రభుత్వమే పెద్ద దిక్కు అన్నారు కరీంనగర్​ మేయర్​ సునీల్​ రావు. జిల్లాలోని కట్టరాంపూర్​లోని నగరపాలక సంస్థ నిరాశ్రయుల కేంద్రంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. స్థానికంగా ఉండే.. నిరాశ్రయులందరూ ఉచితంగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

Karimnagar Mayor Free Health Camp For Poor people
నిరాశ్రయులకు వైద్య శిబిరం ఏర్పాటు చేసిన మేయర్​

By

Published : Jun 30, 2020, 7:51 PM IST

కరీంనగర్​ జిల్లా కట్టరాంపూర్​ నగరపాలక సంస్థ నిరాశ్రయ కేంద్రంలో మేయర్​ సునీల్​ రావు నిరాశ్రయుల కోసం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. నిరాశ్రయుల ఆరోగ్య బాధ్యత నగర పాలక సంస్థ బాధ్యత అని ఆయన అన్నారు. దగ్గరుండి నిరాశ్రయులకు వైద్య పరీక్షలు చేయించారు. వైద్య పరీక్షల అనంతరం వైద్యులు సూచించిన విటమిన్ టాబ్లెట్స్, వివిధ రకాల మందులను పంపిణీ చేశారు. నగరపాలక సంస్థ నిరాశ్రయ కేంద్రానికి కావలసిన పలు వసతులు సౌకర్యాలను కల్పిస్తామన్నారు.

ABOUT THE AUTHOR

...view details