పారిశుద్ధ్య కార్మికులకు రక్షణ కల్పించడం నగరపాలక సంస్థ బాధ్యతని కరీంనగర్ మేయర్ సునీల్‌రావు అన్నారు. ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న 33వ డివిజన్ భగత్‌నగర్‌లో క్యాంపు కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికులకు హెల్త్ కిట్లను మేయర్ పంపిణీ చేశారు. నగరవ్యాప్తంగా 60 డివిజన్ల పరిధిలో పనిచేసే స్వీపర్లు, రిక్షా కార్మికులు, డ్రైనేజీ క్లీనర్లకు 1,030 హెల్త్ కిట్లను పంపిణీ చేశారు.
పారిశుద్ధ్య కార్మికులకు హెల్త్ కిట్లు పంపిణీ చేసిన మేయర్ - పారిశుద్ధ్య కార్మికులకు హెల్త్ కిట్లు పంపిణీ చేసిన మేయర్
కరీంనగర్ నగరవ్యాప్తంగా 60 డివిజన్ల పరిధిలో పనిచేసే స్వీపర్లు, రిక్షా కార్మికులు, డ్రైనేజీ క్లీనర్లకు 1,030 హెల్త్ కిట్లను మేయర్ సునీల్‌రావు పంపిణీ చేశారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో తమ ప్రాణాలను సైతం ఎదిరించి కృషి చేస్తున్న కార్మికులను మేయర్ అభినందించారు.
పారిశుద్ధ్య కార్మికులకు హెల్త్ కిట్లు పంపిణీ చేసిన మేయర్
కార్మికుల పాదరక్షణ కోసం బూట్లు, చేతుల రక్షణ కోసం నాణ్యమైన గ్లౌజులు, సబ్బులను పంపిణీ చేశారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో రెండు రోజుల క్రితం ప్రారంభించి పలు డివిజన్లలో పనిచేసే కార్మికులకు హెల్త్ కిట్లను పంపిణీ చేసినట్లు మేయర్ సునీల్‌రావు తెలిపారు.