తెలంగాణ

telangana

ETV Bharat / state

రోడ్లు, డ్రైనేజీలకు మరమ్మతులు చేస్తాం: మేయర్ - ksrimnagar mayor sunil rao

కరీంనగర్​ 50వ డివిజన్​లో పర్యటించిన మేయర్ సునీల్ రావు.. గణేశ్​నగర్​ రోడ్డులో శిథిలమైన డ్రైనేజీలను పరిశీలించారు. స్వశక్తి కళాశాల వద్ద ఉన్న ప్రధాన మురుగు నీటి కాల్వకు మరమ్మతులు చేపడతామని హామీ ఇచ్చారు.

karimnagar mayor assured locals to repair damaged roads
నగరంలో మేయర్ సునీల్ రావు పర్యటన

By

Published : Oct 8, 2020, 12:09 PM IST

కరీంనగర్​లోని 50వ డివిజన్​లో మేయర్ సునీల్ రావు పర్యటించారు. గణేశ్​నగర్​లో శిథిలమైన డ్రైనేజీలను పరిశీలించి.. రూ.10 కోట్లతో నిర్మించేందుకు టెండర్లు నిర్వహించామని చెప్పారు. 11వ డివిజన్​లో రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

స్వశక్తి కళాశాల ముందు ఉన్న ప్రధాన మురుగు నీటి కాల్వకు మరమ్మతులు చేపడతామని మేయర్ హామీ ఇచ్చారు. నగరంలో ఉచితంగా కరోనా పరీక్షలు చేసేందుకు శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గౌతమీనగర్​లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. పాలనాధికారి ఆదేశాల మేరకు నగరంలో 15 ప్రాంతాల్లో ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు అంజయ్య , ఆకుల నర్మద, నర్సయ్య పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details