కాంగ్రెస్, భాజపాలు ప్రజల తీర్పును అపహాస్యం చేస్తున్నాయని కరీంనగర్ నగర పాలక సంస్థ మేయర్ సునీల్‌రావు విమర్శించారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో పాల్గొన్న ఆయన ఇరు పార్టీల నేతలు తాము అధికారంలోకి వచ్చినట్లు పగటికలలు కంటున్నారని ఎద్దేవా చేశారు.
ప్రజల తీర్పును విపక్షాలు అపహాస్యం చేస్తున్నాయి: సునీల్‌రావు - కరీంనగర్ మున్సిపాలిటీ వార్తలు
రాష్ట్రాభివృద్ధే తెరాస ప్రధాన లక్ష్యమని కరీంనగర్ నగరపాలక సంస్థ మేయర్ సునీల్‌రావు తెలిపారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అధికారం కోసం భాజపా, కాంగ్రెస్ నేతలు ఆరాటపడుతున్నారని విమర్శించారు.
![ప్రజల తీర్పును విపక్షాలు అపహాస్యం చేస్తున్నాయి: సునీల్‌రావు karimnagar mayor allegation on bjp and congress partys are mocking the judgment of the people](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10626013-36-10626013-1613310304034.jpg)
ప్రజల తీర్పును విపక్షాలు అపహాస్యం చేస్తున్నాయి: సునీల్‌రావు
రాష్ట్రంలో అధికారం కోసం భాజపా, కాంగ్రెస్ నేతలు ఆరాటపడుతున్నారని సునీల్‌రావు మండిపడ్డారు. విపక్షనేతలు దిగజారి వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారన్నారు. భాషతీరు మార్చుకోకపోతే వారి కన్నా ఎక్కువగా విమర్శించే శక్తి తెరాసకు ఉందని ఆయన అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి రైతులకు సాగు నీరు, 24 గంటల విద్యుత్ ఇస్తున్నందుకు తమని విమర్శిస్తున్నారా అని ప్రశ్నించారు.
ఇదీ చదవండి:ప్రేమి'కుల' పెళ్లి సమస్యకు నింగప్ప పరిష్కారం