తెలంగాణ

telangana

ETV Bharat / state

Corona Vaccination Record: కరోనా వ్యాక్సినేషన్​లో కరీంనగర్​ ఆదర్శం..

Corona Vaccination Record: దేశంలోనే తొలిసారి అత్యధిక కరోనా కేసులతో రికార్డు సృష్టించిన కరీంనగర్ ఇప్పుడు వ్యాక్సినేషన్‌లోను సరికొత్త రికార్డును సృష్టించింది. ఇండోనేషియా నుంచి వచ్చిన వారితో ఒకేసారి పది కేసులు నమోదు కావడంతో కంటైన్‌మెంట్‌ జోన్‌తో కట్టడి చేసి సరికొత్త పాఠాలు నేర్పింది. ఇప్పుడు నూటికి నూరు శాతం వ్యాక్సిన్‌తో ఇతర జిల్లాలకు స్ఫూర్తిగా నిలిచింది కరీంనగర్.

Corona Vaccination Record: కరోనా వ్యాక్సినేషన్​లో కరీంనగర్​ ఆదర్శం..
Corona Vaccination Record: కరోనా వ్యాక్సినేషన్​లో కరీంనగర్​ ఆదర్శం..

By

Published : Jan 27, 2022, 3:23 AM IST

కరోనా వ్యాక్సినేషన్​లో కరీంనగర్​ ఆదర్శం..

Corona Vaccination Record: కొవిడ్‌పై ఎలాంటి చికిత్స అందించాలో తెలియని సమయంలో కరీంనగర్‌లో వైరస్‌ వ్యాప్తి కలకలం రేపింది. ఆ సమయంలో కంటైన్‌మెంట్‌ జోన్‌, సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావకాలతో కొవిడ్‌ వ్యాప్తి అడ్డుకట్ట వేసి ప్రజల్లో ధైర్యాన్ని కల్పించింది. ఇప్పుడు టీకా పంపిణీలోనూ తనకంటూ ప్రత్యేకత చాటుకుంది కరీంనగర్‌ జిల్లా. రాష్ట్రంలో రెండు డోసులు 100 శాతం పూర్తి చేసుకున్న తొలిజిల్లాగా, దక్షిణాది రాష్ట్రాల్లో రెండో జిల్లాగా రికార్డు సొంతం చేసుకుంది. జిల్లాలో 7లక్షల 92వేల 922 మందికి టీకాలు వేయాలని లక్ష్యాన్ని నిర్ధారించగా.. మొదటి విడత ఇప్పటివరకు 8లక్షల 27వేల 103 డోసులు పంపిణీ చేశారు. ఇందులో గ్రానైట్ పరిశ్రమ ఉపాధి కోసం కోసం వచ్చిన కార్మికులకు కూడా వ్యాక్సిన్‌ వేయడంతో తొలి విడత 104శాతానికి చేరింది.

పకడ్బందీ ప్రణాళికతో..

వ్యాక్సినేషన్‌లో కరీంనగర్‌ జిల్లా అధికార యంత్రాంగం పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగింది. నగరపాలక సంస్థ పరిధిలో ప్రతి డివిజన్‌కు ఒక టీకా కేంద్రాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా .. పీహెచ్​సీలకు కూడా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. రాష్ట్రమంతా ఇంటింటా ఫీవర్‌ సర్వే జరుగుతుంటే కరీంనగర్ జిల్లాలో మాత్రం సమగ్రసర్వే నిర్వహించేందుకు ప్రత్యేకంగా 759కుపైగా ప్రత్యేక బృందాలను నియమించారు. ప్రజల వద్దకు వెళ్లినప్పుడు చాలా మంది వైరస్ బారిన పడినప్పటికీ వైద్యసిబ్బంది భయపడకుండా లక్ష్యాన్ని పూర్తి చేసింది.

దక్షిణాది రాష్ట్రాలకు ఆదర్శం

దక్షిణాది రాష్ట్రాల్లో రెండు డోసులు పూర్తయిన జిల్లాగా బెంగళూరు అర్బన్‌ మొదటి స్థానంలో నిలువగా, కరీంనగర్‌ రెండో స్థానంలో నిలిచింది. తెలంగాణతోపాటు దక్షిణాది రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు ప్రశంసించారు.

ఇదీ చదవండి:

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ABOUT THE AUTHOR

...view details