Karimnagar Girls Govt School Problems :కరీంనగర్ డాక్టర్స్ స్ట్రీట్‌లో బాలికల కోసం ప్రత్యేక పాఠశాలను ఏర్పాటు చేసారు. అందులో తొలుత ఉర్దూమీడియం, ఆ తర్వాత తెలుగు, ఇటీవల ఆంగ్ల మాధ్యమాన్ని ప్రారంభించారు. అంతవరకు బాగానే ఉన్న పాఠశాలలో సదుపాయాలకు ఏమాత్రం శ్రద్ద వహించడం లేదని విద్యార్ధినులతో పాటు ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తరగతి గదిలో చదువుకుంటున్నప్పుడు తలపైకెత్తితే చాలు ఎక్కడ పైకప్పు కూలుతుందో అన్న భయం విద్యార్దులకు వెంటాడుతోంది. దాదాపు 200మంది విద్యార్ధినులు చదువుకుంటున్నారు. ఉపాధ్యాయుల కొరత ఉందని, అంతేకాకుండా స్టాఫ్‌రూంతో పాటు తరగతి గదులు కూడా అధ్వాహ్నంగా మారాయి. దాదాపు నైజాం కాలంలో పాఠశాలను ప్రారంభించారు.
అధ్వాన్నంగా కళాశాల - వసతుల్లేక విద్యార్థులు విలవిల - ఇలా అయితే చదువులు సాగేదెలా!
Karimnagar Girls Govt School Dilapidated : పాఠశాల స్థితిగతులను చూసిన తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు పంపడం మానేశారు. దీనితో తెలుగు మీడియం తరగతులను రద్దు చేసుకున్నారు.ప్రస్తుతం ఉర్దూతో పాటు ఆంగ్ల మాధ్యమం మాత్రమే కొనసాగుతోంది. తరగతి గదులతో పాటు వంట గది, మూత్రశాలలు కూడా కూలిపోయాయని విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలు వినడం తప్ప పరిష్కరించే వారు కరవయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు వర్షం కురిసినా తమ తరగతి గది కూలడం ఖాయమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుండగా మధ్యాహ్న భోజనం వంటశాల కూడా ఇబ్బందికరంగా ఉందని కార్మికులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
వర్షాకాలంలో చాలా ఇబ్బంది అవుతుంది. మాకు మంచి సౌకర్యాలు కల్పించాలి. తల్లి దండ్రులు అడ్మిషన్ కోసం వచ్చి సౌకర్యాలు బాగా లేవని వెళ్లిపోతున్నారు. మరుగుదొడ్లు శుభ్రంగా ఉంచడం లేదు. పాఠశాలలో 200 మంది విద్యార్థులు ఉంటాం. కానీ మాకు కనీస సౌకర్యాలు లేవు. వంటగది సరిగ్గా లేదు, భోజనం చేయడానికి సరైన వసతి లేదు. ప్రభుత్వం మాకు కొత్త భవనం కట్టించాలి."- విద్యార్థులు