శీతల ప్రాంతంలోనే కాదు... తెలంగాణలో కూడా పండించొచ్చని నిరూపించాడు! - కరీంనగర్లో రుద్రాక్ష చెట్ల పెంపకం
Rudraksha tree in Karimnagar : ప్రత్యేక వాతావరణ పరిస్థితుల్లోనే కాసే రుద్రాక్ష... తెలంగాణ గడ్డపై కాసింది. వ్యవసాయ క్షేత్రంలో అనుకూల వాతావరణ పరిస్థితులు కల్పించి కరీంనగర్ జిల్లా వాసి ఈ పంటను సాగుచేశారు. దశాబ్దానికి పైగా సహనంతో చేసిన సేద్యం.. ఫలితానిచ్చింది. పరమేశ్వరుడి స్వరూపంగా భావించే పవిత్ర రుద్రాక్ష శీతల వాతావరణం ఉండే ప్రాంతాల్లోనే ఎక్కువగా పండుతుంది. అయితే తెలంగాణ నేలపైనా సాగు చేయొచ్చని చూపించిన రవాణా శాఖ విశ్రాంత ఉద్యోగి ఆకుల లక్ష్మయ్యతో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి.
Rudraksha tree