అనుభవం లేని వారు శస్త్రచికిత్సలు చేస్తే రోగి ప్రాణాలకే ముప్పు వస్తుందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు డాక్టర్ విజయలక్మీ అన్నారు. ఆయుర్వేదంలో పీజీ చేసిన వారు కూడా ఆల్లోపతి చికిత్స చేసేందుకు వీలుగా కేంద్రం విడుదల చేసిన జీవోను ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ మేరకు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఐఎంఏ భవనం ముందు మహిళా వైద్యులతో కలిసి నిరాహారదీక్ష చేపట్టారు.
ఆ జీవోను కేంద్రం వెంటనే రద్దు చేయాలి: జిల్లా వైద్యులు - doctors protest in karimnagar latest
ఆయుర్వేదంలో పీజీ చేసినవారిని కూడా ఆల్లోపతి చికిత్స చేసేందుకు వీలుగా కేంద్రం విడుదల చేసిన జీవోను కరీంనగర్ జిల్లా వైద్యులు వ్యతిరేకించారు. ఈ మేరకు ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని ఐఎంఏ భవనం ముందు నిరాహారదీక్ష చేపట్టారు.
ఆ జీవోను కేంద్రం వెంటనే రద్దు చేయాలి: జిల్లా వైద్యులు
ఇతర విభాగాల్లో వైద్యవిద్యను అభ్యసించిన వారికి ఆల్లోపతి చికిత్స చేసేందుకు వీలుగా కేంద్రం విడుదల చేసిన జీవోను వెంటనే రద్దు చేయాలని ఐఎంఏ కరీంనగర్ జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ విజయలక్ష్మీ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా వైద్యులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:ఘోర ప్రమాదంలో క్షేమంగా బయటపడిన చిన్నారి