తెలంగాణ

telangana

ETV Bharat / state

Karimnagar Doctors Dance: సామీ.. సామీ పాటకు స్టెప్పులేసిన డాక్టర్ దంపతులు - Karimnagar district news

Karimnagar Doctors Dance: వారిద్దరూ వృత్తిరీత్య డాక్టర్లు. కానీ కాసేపు వారేంటో మర్చిపోయారు. సరదాగా స్టేజ్‌పై కాలుకదిపారు. కరీంనగర్‌లో ఓ ఆసుపత్రి వార్షికోత్సవంలో వైద్య దంపతులు చేసిన డాన్స్‌ ఆకట్టుకుంటోంది.

Doctors Dance
Doctors Dance

By

Published : Dec 29, 2021, 5:05 PM IST

Karimnagar Doctors Dance: జనాలపై సినిమాల ప్రభావం చాలా గట్టిగా ఉంది. అంతే కాదండోయ్... అందులో ఉండే పాటలు, డైలాగులు ఇలా.. ప్రజలపై ప్రభావాన్ని చూపుతున్నాయి. సినిమాలే కాకుండా జానపద పాటలు కూడా ఈ మధ్య జనంలోకి బాగా చొచ్చుకెళ్తున్నాయి. ఈ మధ్య సంచలనం సృష్టించిన నీ బుల్లెట్టు బండిక్కె వచ్చేత్తపా.. అనే పాట.. ఇటీవల నూతన దంపతులను విశేషంగా ఆకట్టుకుంది. వివాహ వేడుకల్లో వధూవరులు బుల్లెట్టు బండి పాటకు ఆడిపాడారు. ఆ వీడియో వైరల్ అవడం క్షణాల్లో జరిగిపోయింది. ఎక్కడ చూసినా ఆ పాటే.

అయితే ట్రెండ్‌కు తగ్గట్లుగా మారడం అలవాటు చేసుకున్నారు ప్రజలు. తాజాగా రిలీజైన పుష్ప సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది. అందులో ఉన్న డైలాగులు, పాటలు జనాల్ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఆ సినిమాలోని సామీ.. సామీ.. పాటకు ప్రజలు ఫిదా అవుతున్నారు. కరీంనగర్‌లో ఓ ఆసుపత్రి వార్షికోత్సవంలో వైద్య దంపతులు చేసిన డాన్స్‌ ఆకట్టుకుంటోంది. డాక్టర్ బంగారి స్వామి, రజని ప్రియదర్శిని వేసిన స్టెప్పులు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

సాధారణ జనాలే కాదు డాక్టర్ల చేత కూడా పుష్పరాజ్ స్టెప్పులేయించాడు. ఇటీవలే ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ చేసిన పుష్ప వీడియో, టీం ఇండియా క్రికెటర్ రవీంద్ర జడేజా వీడియో హల్‌చల్ చేశాయి. సోషల్ మీడియాలో ఒక ఊపు ఊపాయి. తాజాగా డాక్టర్ల డాన్స్ అందరినీ ఆకట్టుకుంటోంది.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details