'ప్రతి కేంద్రంలోను 100మందికి మాత్రమే టీకా వేయగలం. కొవాగ్జిన్ రెండో డోసును మొదటి డోసు తీసుకున్న 28 రోజుల తర్వాత ఇస్తాం. కొవిషీల్డ్ రెండో డోసును ఆరువారాల నుంచి 8వారాల లోపు తీసుకోవచ్చని ప్రపంచ ఆరోగ్యసంస్థ సూచించింది.'
ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికే టీకా: డీఎంహెచ్ఓ సుజాత - corona vaccination in karimnagar
ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికే టీకా ఇవ్వడం సాధ్యమవుతుందని కరీంనగర్ జిల్లా వైద్యశాఖాధికారి డాక్టర్ సుజాత తెలిపారు. ఇంతకు ముందు ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ వ్యాక్సిన్ పంపిణీ ఉండేదని.. ఇక ముందు ఉండబోదని ఆమె స్పష్టం చేశారు. జిల్లాలోని ప్రాథమిక, పట్టణ ఆరోగ్యకేంద్రాలతో పాటు జిల్లా ఆసుపత్రుల్లో మాత్రమే టీకా ఇవ్వనున్నట్లు సుజాత స్పష్టం చేశారు. వైరస్ సోకినప్పటికీ హోం ఐసోలేషన్‌లో స్వల్ప జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందంటున్న కరీంనగర్ డీఎంహెచ్ఓ సుజాతతో మా ప్రతినిధి ముఖాముఖి..
కరీంనగర్ డీఎంహెచ్ఓతో ముఖాముఖి
డాక్టర్ సుజాత, కరీంనగర్ డీఎంహెచ్ఓ
ఇదీ చదవండి:పేర్లు నమోదు చేసుకున్నవారికే రెండో డోస్: డీహెచ్