తెలంగాణ

telangana

ETV Bharat / state

మనోహరాబాద్ రైల్వేలైన్ భూసేకరణ ప్రక్రియ మొదలు - Karimnagar District Latest News

మనోహరాబాద్ రైల్వేలైన్ కోసం రెవెన్యూ అధికారులు భూసేకరణ ప్రక్రియ మొదలుపెట్టారు. కరీంనగర్ జిల్లా రామడుగు, గంగాధర మండలాల్లో భూసేకరణ సభలు నిర్వహించారు. చట్టం ప్రకారం నష్ట పరిహారం అందజేస్తామని ఆర్డీ ఆనంద్ కుమార్ వెల్లడించారు.

మనోహరాబాద్ రైల్వేలైన్ భూసేకరణ ప్రక్రియ మొదలు
మనోహరాబాద్ రైల్వేలైన్ భూసేకరణ ప్రక్రియ మొదలు

By

Published : Mar 19, 2021, 9:28 PM IST

మనోహరాబాద్ రైల్వేలైన్ కోసం కరీంనగర్ జిల్లాలో భూసేకరణ ప్రక్రియను రెవెన్యూ అధికారులు మొదలుపెట్టారు. రామడుగు, గంగాధర మండలాల్లో సభలు నిర్వహించారు. సోషియో ఎకనామిక్ సర్వే నిర్వహించి నిర్వాసితుల ఆర్థిక పరిస్థితులను నివేదిక రూపంలో సిద్ధం చేశారు.

రైల్వేలైను భూసేకరణ వివరాలు గ్రామ సభల్లో రైతుల ముందు ప్రకటించారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం అందిస్తామని కరీంనగర్ ఆర్డీ ఆనంద్ కుమార్ వెల్లడించారు. 151 కిలోమీటర్ల లైనులో కొత్తపల్లి వరకు నాలుగో విడతలో పనులు పూర్తి చేస్తామని రైల్వే ఇంజినీర్ ధర్మారావు తెలిపారు. గజ్వేల్ నుంచి సిద్ధిపేట వరకు వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పనులు పూర్తి కానున్నట్టు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో నూతన రైల్వేలైను రూపుదిద్దుకుంటున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:కేంద్రం కోత పెడితే.. రాష్ట్రం కడుపు నింపింది : హరీశ్ రావు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details