కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో మంత్రి ఈటల రాజేందర్ పర్యటించారు. ముదిమాణిక్యం గ్రామ శివారులో మిడ్ మానేరు లింక్ కెనాల్‌కు భూమి పూజ నిర్వహించి పనులను ప్రారంభించారు. మిడ్ మానేరు లింక్ కెనాల్ కింద నష్టపోయిన రైతులకు పరిహారంగా రూ.30 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి వెల్లడించారు.
జులై 15 నాటికి కాలువ పూర్తి
వచ్చే జులై 15 నాటికి లింక్ కాలువ పూర్తి చేసి.. ప్రజలకు సాగు నీరు అందిస్తామని మంత్రి ఈటల స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా వచ్చే గోదావరి జలాలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మిడ్ మానేరు జంక్షన్‌గా ఉందని పేర్కొన్నారు. రైతులకు ఎలాంటి ఆపద వచ్చినా వారి వెంట.. తాముంటామని మంత్రి భరోసా ఇచ్చారు. అనంతరం చిగురు మామిడి, సైదాపూర్ మండలాల్లోని మిడ్ మానేరు కుడి కాలువను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్ కుమార్, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, కరీంనగర్ జడ్పీ ఛైర్మన్ విజయ పాల్గొన్నారు.
ఇదీ చూడండి:వర్సిటీల ప్రైవేటీకరణకు ప్రభుత్వ కుట్ర: భట్టి