రాజకీయంగా లబ్ధిపొందాలనే భ్రమలో... పార్టీని అప్రతిష్టపాలు చేసే ప్రయత్నాలు జడ్పీటీసీ మాడుగుల రవీందర్ రెడ్డి మానుకోవాలని ఎంపీపీ లింగాల మల్లారెడ్డి ఆరోపించారు. గన్నేరువరం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ లింగాల మల్లారెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. మూడు పర్యాయాలుగా ఎమ్మెల్యేకు ఆహ్వాన పత్రికను పంపడం లేదని ఆరోపిస్తూ.. జడ్పీటీసీ మాడుగుల రవీందర్ రెడ్డి ఎజెండా పత్రాలను చింపివేశాడు. దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన రోజులు వస్తాయని ఎంపీపీ పేర్కొన్నారు. ఉమ్మడి బెజ్జంకి, గన్నేరువరం మండలాల్లో తెరాస మండల అధ్యక్షుడిగా పనిచేసిన తీరును గుర్తించి పార్టీ ముఖ్య నాయకులు ఎంపీపీ పీఠం అందజేసి జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షుడిగా నియమించారని గుర్తు చేశారు. నీచ రాజకీయాలకు ఒడిగడుతూ తనను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు మండలాధ్యక్షుడు ఉత్తర్వులు చేయడం అవివేకమన్నారు
'పార్టీని అప్రతిష్ఠపాలు చేసే ప్రయత్నాలు మానుకోవాలి' - karimnagar latest updates
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ లింగాల మల్లా రెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మూడు పర్యాయాలుగా ఎమ్మెల్యేకు ఆహ్వానం అందడం లేదని ఆరోపిస్తూ.. జడ్పీటీసీ మాడుగుల రవీందర్ రెడ్డి ఎజెండా పత్రాలను చింపివేశాడు.
'పార్టీని అప్రతిష్ఠపాలు చేసే ప్రయత్నాలు మానుకోవాలి'