తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆన్​లైన్ తరగతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి: డీఈవో

కరోనాతో పాఠాశాలలు తెరిచేందుకు వీలులేదు. దీంతో ఆన్​లైన్​ తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరీంనగర్​లో జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రావు డిజిటల్ పాఠాలను ప్రారంభించారు.

By

Published : Sep 1, 2020, 2:04 PM IST

డిజిటల్​ పాఠాలు ప్రారంభించిన డీఈవో
డిజిటల్​ పాఠాలు ప్రారంభించిన డీఈవో

కరీంనగర్​లోని కార్ఖానాగడ్డ జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రావు డిజిటల్ పాఠాలను ప్రారంభించారు. డిజిటల్ తరగతులపై ఉపాధ్యాయులకు సూచనలు చేశారు. విద్యార్థుల ఇళ్లకు వెళ్లి ఆన్​లైన్ పాఠాలు పరిశీలించారు. కొవిడ్​ నేపథ్యంలో సర్కారు బడులు తెరుచుకోలేదు. గత ఐదు మాసాలుగా విద్యార్థులు ఇంటికే పరిమితమయ్యారు.

ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు ఆన్​లైన్ పాఠాలు ప్రారంభం కాగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆన్​లైన్​ తరగతులు మొదలు కాలేదు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కూడా ఆన్​లైన్​ తరగతులు నిర్వహించాలని సర్కార్​ నిర్ణయించింది. ఆన్​లైన్​ పాఠాలను నేటి నుంచి ప్రారంభించింది.

ఇదీ చదవండి:స్వచ్ఛమైన గాలి.. మట్టివాసన... ఫామ్‌టూర్స్‌కు నగరవాసులు

ABOUT THE AUTHOR

...view details