ప్రతి ఒక్కరూ కొవిడ్ ప్రోటోకాల్ పాటించాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ స్పష్టం చేశారు. ప్రస్తుతం జిల్లాలో కరోనా పాజిటివిటి రేటు తక్కువగానే ఉన్నా.. నిబంధనలు పాటించాలని సూచించారు. థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్నామన్న సీపీ.. అందులో భాగంగానే రోజు మాస్క్ ధరించని సుమారు 500 మందిపై కేసులు నమోదుచేసినట్లు పేర్కొన్నారు.
కరీంనగర్లోని రెండో పట్టణ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన సీపీ.. పౌరులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. నగరంలోని ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి తగిన సూచనలు ఇచ్చారు. రాత్రి వేళల్లో యువత రోడ్లపైకి రాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు సీపీ సత్యనారాయణ తెలిపారు.