నాయిని నరసింహా రెడ్డి మృతి బాధాకరమని కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి అన్నారు. పోలీస్ కమిషనర్ కార్యాలయంలో మాజీ మంత్రి చిత్రపటానికి పూలమాల వేసి నివాళర్పించారు. నాయిని నరసింహారెడ్డి సాధారణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు.
నాయిని నరసింహా రెడ్డికి కరీంనగర్ సీపీ నివాళులు - కరీంనగర్ జిల్లా వార్తలు
మాజీ హోంమంత్రి, కార్మిక సంఘాల నాయకులు నాయిని నరసింహా రెడ్డికి కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి నివాళులర్పించారు. నాయిని సాధారణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు.

నాయిని నరసింహా రెడ్డికి కరీంనగర్ సీపీ నివాళులు
ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ ఎస్ శ్రీనివాస్, జి. చంద్రమోహన్ (పరిపాలన), ట్రైనీ ఐపీఎస్ అధికారి సాధన రష్మి పెరుమాళ్ పాల్గొన్నారు.
ఇదీ చూడండి:వరద వల్ల భారీ నష్టం... ముంపు ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన