కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో 250 మంది పెట్రోలింగ్ సిబ్బందిని నియమించామని సీపీ కమలాసన్‌రెడ్డి తెలిపారు. ప్రజలకు మెరుగైన భద్రత కల్పించేందుకు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
'హైదరాబాద్, సైబరాబాద్ తర్వాత.. కరీంనగరే' - సీపీ కమలాసన్‌రెడ్డి
పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హ్యాక్ ఐ యాప్‌ను హైదరాబాద్, సైబరాబాద్ తర్వాత కరీంనగర్ కమిషనరేట్‌లోనే అధికంగా డౌన్లోడ్ చేసుకున్నారని సీపీ కమలాసన్‌రెడ్డి అన్నారు.
కరీంనగర్ సీపీ కమలాసన్‌రెడ్డి
హుజూరాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన వాల్ ఆఫ్ కైండ్నెస్ను సీపీ కమలాసన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సీఐ, ఏసీపీ, కమిషనర్లను అభినందించారు.