కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి అన్నారు. స్వీయ నియంత్రణతోనే మహమ్మారి బారిన పడకుండా ఉండొచ్చని చెప్పారు. కరోనా నుంచి గట్టెక్కాలంటే.. టీకా తీసుకోవడమే ఏకైక మార్గమని సూచించారు.
'కరోనా నుంచి గట్టేందుకు అదే మార్గం' - telangana news
కరోనా నుంచి గట్టెక్కాలంటే.. టీకా తీసుకోవడమే ఏకైక మార్గమని కరీంనగర్ సీపీ కమలాసన్‌రెడ్డి సూచించారు. కరీంనగర్‌లోని ఖానాపూర్, హుస్సేన్‌పూర్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 33 సీసీకెమెరాలను ప్రారంభించారు.
karimnagar cp
కరీంనగర్‌లోని ఖానాపూర్, హుస్సేన్‌పూర్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 33 సీసీకెమెరాలను సీపీ ప్రారంభించారు. తాను వచ్చినప్పుడు 30 కెమెరాలు మాత్రమే ఉన్నాయని.. ప్రస్తుతం 3వేల కెమెరాలు ఉన్నాయని తెలిపారు. సీసీకెమెరాలకు విరాళం అందించిన వారిని అభినందించారు.
ఇదీ చదవండి :అంబులెన్స్‌లే పడకలు.. గంటల తరబడి నిరీక్షణలు..!