కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ మానకొండూరు నియోజకవర్గంలోని బెజ్జంకి మండలంలో పర్యటించారు. వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులను పరామర్శించి.. ప్రభుత్వం నుంచి నష్టపరిహారం సాధించేందుకు పోరాడతామన్నారు. తంగళ్లపల్లి, గుగ్గిళ్ల మధ్య వరదల కారణంగా కొట్టుకుపోయిన రోడ్డును, నీట మునిగిన వరి, పత్తి పంటలను పరిశీలించారు. పెరుకబండ గ్రామంలో పర్యటించి ముంపు గ్రామంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కళ్లెపల్లి, గుంటూరుపల్లి, గూడెంతాళ్లపల్లి మధ్య గల రోడ్డు తెగిపోయి ఆయా గ్రామాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని, కాంట్రాక్టర్ల అవినీతి, అధికారుల నిర్లక్ష్యం వల్లనే రోడ్లు, చెక్‌డ్యామ్‌లు కొట్టుకుపోతున్నాయని ఆరోపించారు.
'పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి' - నీట మునిగిన పంటలు
వర్షాలతో పంట నష్టపోయిన రైతులను కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మానకొండూరు నియోజకవర్గ ఇంఛార్జి కవ్వంపల్లి సత్యనారాయణ పరామర్శించారు. నియోజకవర్గంలోని బెజ్జంకి మండలంలో పర్యటించిన ఆయన... పంట నష్టానికి ప్రభుత్వం పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ తరుపున ప్రభుత్వానికి ,అధికారులకు నివేదిక సమర్పించి ఒత్తిడి చేస్తామని తెలిపారు. వర్షాల కారణంగా కూలిపోయిన ఇండ్లు, రహదారులు, లింక్ రోడ్లు, పంట నష్టయిపోయిన రైతాంగానికి తక్షణ సహాయం అందేలా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ తరపున పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెప్యాల శ్రీనివాస్ గౌడ్ , బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొమ్మెర రవీందర్ రెడ్డి, పులి కృష్ణ, వడ్లూరి పరశురాములు, గూడెల్లి శ్రీకాంత్, పోతిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, శానగొండ శ్రావణ్, మైల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి :విఫలమవడానికి గల కారణాలపై కమిటీ వేశాం : జెన్‌కో సీఎండీ