నీటి, ఇంటి పన్ను చెల్లించే వారికి ప్రభుత్వం మరోసారి రాయితీ ప్రకటించిందని కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ వల్లూరి క్రాంతి ప్రకటించారు. సుంకంపై ఉన్న వడ్డీకి 90శాతం మినహాయింపు లభించే అవకాశం ఈనెల 30తో ముగియనున్నట్లు పేర్కొన్నారు. నగర పరిధిలో ఇప్పటి వరకు రూ.20 కోట్లు వసూలైనట్లు తెలిపారు.
'పన్ను చెల్లించడానికి ప్రభుత్వం మరోసారి రాయితీ'
ఇళ్లు, నీటి పన్ను చెల్లించడానికి ప్రభుత్వం మరోసారి రాయితీ ప్రకటించిందని కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ వల్లూరి క్రాంతి ప్రకటించారు. సెలవు రోజుల్లోనూ కౌంటర్లు పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
కరీంనగర్ మున్సిపలిటీలో పన్ను చెల్లించడానికి మరోసారి రాయితీ
పన్నులు నగర అభివృద్ధికి మాత్రమే వినియోగిస్తామని పేర్కొన్నారు. వసూళ్ల కోసం సెలవు రోజుల్లోనూ కౌంటర్లు పనిచేసేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. కౌంటర్లలో లేదా తమ వద్దకు వచ్చే సిబ్బందికి నేరుగా ఆన్‌లైన్‌లో చెల్లించాలని సూచించారు.