కరీంనగర్ జిల్లాలో కంటైన్మెంట్ ప్రాంతాల్లో ఉన్న వారు ఎవరూ కూడా బయటకు రావద్దని కలెక్టర్ కె.శశాంక సూచించారు. వారికి అవసరమైన అన్ని నిత్యావసరాలు ఇంటి వద్దకే పంపిణీ చేస్తామన్నారు. శర్మానగర్లో ఒకరికి పాజిటివ్ వచ్చినందున, అతన్ని గాంధీ ఆస్పత్రికి తరలించామని తెలిపారు. వారితో ఎవరైనా సన్నిహితంగా ఉన్నట్లైతే వారు స్వచ్ఛదంగా ముందుకొచ్చి ప్రభుత్వాసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలన్నారు.
లాక్డౌన్కు ప్రజలంతా సహకరించాలని కలెక్టర్ సూచన - కరీంనగర్ కలెక్టర్ కె.శశాంక
రాష్ట్ర ప్రభుత్వం పొడిగించిన లాక్డౌన్కు ప్రజలందరూ సహకరించాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ కె.శశాంక అన్నారు. శర్మానగర్ నియంత్రిత ప్రాంతాల్లో మేయర్ సునీల్ రావు, మున్సిపల్ కమిషనర్ క్రాంతితో కలిసి పర్యటించారు.
లాక్డౌన్కు ప్రజలంతా సహకరించాలని కలెక్టర్ సూచన
ముఖ్యంగా పోలీసులు, వైద్య సిబ్బంది నియంత్రిత ప్రాంతాల్లో వారు బయటకు రాకుండా కట్టుదిట్టమైన నిఘాపెట్టాలన్నారు. లాక్డౌన్కు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటించాలన్నారు.
ఇదీ చూడండి :కానిస్టేబుల్ భార్యను పరామర్శించిన ఎంపీ, ఎమ్మెల్యే