ఆత్మ నిర్భర భారత్ అభియాన్ ప్యాకేజీ కింద అర్హులందరికీ రుణాలు పొడిగించినట్లు కలెక్టర్ శశాంక తెలిపారు. ఎమ్ఎస్ఎమ్ఈల రుణాలపై కలెక్టరేట్లో బ్యాంకర్లతో సమీక్ష నిర్వహించారు.
అర్హులందరికీ రుణాలివ్వాలి: కలెక్టర్ శశాంక - karimnagar collector shashanka review with bankers on msme loans
అర్హత గల సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలకు 20 శాతం మూలధన రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ కె.శశాంక బ్యాంకులను ఆదేశించారు. కలెక్టరేట్లో బ్యాంకర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్ఎస్ఎమ్ఈల రుణాలపై సమీక్ష నిర్వహించారు.
ఎమ్ఎస్ఎమ్ఈల రుణాలపై బ్యాంకర్లతో కలెక్టర్ శశాంక సమీక్ష
ఎమ్ఎస్ఎమ్ఈలకు 20 శాతం మూలధన రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లను కోరారు. అర్హులైన రైతులందరికీ 10 శాతం కేసీసీ లోన్‌ను అందజేయాలని సూచించారు. ముఖ్యంగా వరి మార్పిడి యంత్రాలు, హార్వెస్టింగ్ యంత్రాలు, ట్రాక్టర్ల కోసం డిమాండ్ ఉందన్నారు.
కరోనా వ్యాప్తి వల్ల స్వస్థలాలకు వలస వచ్చిన కార్మికులకు ఎస్జీహెచ్ ప్రకారం ప్రస్తుత పరిమితిలో 10 శాతం రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లను కలెక్టర్ శశాంక ఆదేశించారు.