కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మైనింగ్ అధికారులతో కలెక్టర్ శశాంక జిల్లా స్థాయి ఇసుక సమావేశాన్ని నిర్వహించారు. ఇసుక బుకింగ్, డెలివరీల్లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను అధిగమించడం గురించి కూలంకషంగా ప్రస్తావించారు. ఇసుక రవాణా వల్ల గ్రామాల్లో ఏర్పడుతున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని అన్నారు. ఇసుక రవాణా వల్ల దుమ్ము, ధూళి రాకుండా నీళ్లు చల్లించాలని అధికారులకు సూచించారు.
మైనింగ్ అధికారులతో కలెక్టర్ శశాంక సమావేశం - మైనింగ్ అధికారులతో కలెక్టర్ శశాంక సమావేశం
ఇసుక బుకింగ్, డెలివరీల్లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను అధిగమించాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ కె.శశాంక అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మైనింగ్ అధికారులతో జిల్లా స్థాయి ఇసుక సమావేశం నిర్వహించారు.
మైనింగ్ అధికారులతో కలెక్టర్ శశాంక సమావేశం
ఇప్పటి వరకు ఇసుక రవాణా ద్వారా 33 వేల 928 ట్రాక్టర్ల ఇసుకను గృహ నిర్మాణాలకు, రైతు వేదికలు, డంపింగ్ యార్డుల భవన నిర్మాణాలకు వాడినట్లు తెలిపారు. అలాగే 7 వేల 153 ట్రాక్టర్ల ఇసుకను వివిధ ప్రభుత్వ పనులకు, ఉపాధి హామీ పనులకు సరఫరా చేయడం జరిగిందని కలెక్టర్ శశాంక పేర్కొన్నారు. ప్రస్తుతం వర్షాల కారణంగా ఇసుక సరఫరా కొరత ఏర్పడుతోందని వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. అక్రమంగా ఇసుక రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.