వైద్యం కోసం ఆసుపత్రులకు వెళ్తున్న క్రమంలో పలువురికి కరోనా సోకిందని కరీంనగర్ జిల్లా కలెక్టర్ శశాంక తెలిపారు. మరికొందరు శుభాకార్యాల వంటి కార్యక్రమాలకు హాజరు కావడం వల్ల ఎక్కువ మందికి కొవిడ్ వ్యాపించిందని తెలిసిందన్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారి పట్ల ఇంటి యాజమానులు దురుసుగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలన్నారు.
ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్ - ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలి
కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని కరీంనగర్ జిల్లా కలెక్టర్ శశాంక అన్నారు. జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 437కు చేరగా చాలా మందికి ఇళ్లలోనే చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్న వారిని మేయర్ సునీల్‌రావు, కమిషనర్ క్రాంతి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి సుజాతతో కలిసి పరిశీలించారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలంటున్న కలెక్టర్ శశాంకతో మా ఈటీవీ భారత్ ప్రతినిధి అలీముద్దీన్ ముఖాముఖి...
ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచన