పల్లె ప్రగతి కార్యక్రమం అమలు, గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలపై ఆయా శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలోని మొత్తం 313 గ్రామ పంచాయితీలకు ఉపాధి హామీ పథకం ద్వారా డంపింగ్ యార్డులు మంజూరైనట్లు జిల్లా కలెక్టర్ శశాంక అన్నారు. ఇప్పటికే 281 డంపింగ్ యార్డుల నిర్మాణ పనులు ప్రారంభించినట్లు తెలిపారు. వాటితో పాటు 284 వైకుంఠ దామాలకు గాను 13 నిర్మాణాలు పూర్తయినట్లు పేర్కొన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో పచ్చదనం, పారిశుద్ధ్యం నిర్వహణ కోసం 284 గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లను కొనుగోలు చేశామన్నారు. 500 జనాభా కంటే తక్కువ ఉన్న గ్రామాల్లో ఇతర నిధుల అనుసంధానంతో ట్రాక్టర్ కొనుగోలుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు.
పల్లెప్రగతి, పారిశుద్ధ్యంపై అధికారులతో కలెక్టర్ సమీక్ష - karimnagar today news
జిల్లాలోని అన్ని పంచాయతీల పరిధిలో డంపింగ్ యార్డు, వైకుంఠ దామాలు నిర్మించాలని జిల్లా కలెక్టర్ కె.శశాంక అన్నారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో పల్లె ప్రగతి కార్యక్రమంపై అధికారులతో సమీక్షించారు.
ప్రతివారం 30 నుంచి 50 ట్రక్కు డబ్బాలు, ట్యాంకర్లు తయారు చేయించి, గ్రామాలకు పంపిణీ చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ ఈఈని పాలనాధికారి ఆదేశించారు. రోడ్లకిరువైపులా ఎవెన్యూ ప్లాంటేషన్ మొక్కలు నాటించి వాటికి ట్రీ గార్డులు ఏర్పాటు చేయించేలా చర్యలు తీసుకోవాలని డీఆర్డీవోను ఆదేశించారు. వర్షాకాలంలో మొక్కలు నాటుకునేందుకు వీలుగా నర్సరీలలో డిమాండ్ మేరకు మొక్కలు పెంచాలని సూచించారు. గ్రామ కార్యదర్శులు చేసిన ప్రతి పని, తనిఖీలు, హాజరు వివరాలు పల్లె ప్రగతి యాప్లో నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.