పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకుని కరీంనగర్‌లో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
'ఇఫ్తార్ విందు ప్రజలందరిని ఐక్యం చేస్తుంది' - ifthar party
కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ పాల్గొన్నారు.
'ఇఫ్తార్ విందు ప్రజలందరిని ఐక్యం చేస్తుంది'
ఇలాంటి విందులు కుల మతాలకు అతీతంగా సోదర భావం పెంపొందించడానికి దోహదపడతాయని పాలనాధికారి అభిప్రాయపడ్డారు. టీఎన్‌జీవో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మారం జగదీశ్వర్‌తో పాటు జిల్లాలోని ఉద్యోగులు ఈ విందులో పాల్గొన్నారు.
ఇవీ చూడండి: నా వారసుడిగా సంజయ్ గెలుపు సంతోషకరం