తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటన ఖరారు కాగానే జిల్లా కలెక్టర్ శశాంక అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. విస్తృత ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా మధ్య మానేరు సందర్శన అనంతరం కరీంనగర్‌కు ఒంటిగంటకు చేరుకుంటారని చెప్పారు. రోడ్డు మార్గంలో పర్యటన ఉన్నందున ఆర్ అండ్ బీ అధికారులకు పలు సూచనలు చేశారు.
సీఎం కరీంనగర్ పర్యటనకు ఏర్పాట్లు - CM KCR KARIMNAGAR VISIT
సీఎం కేసీఆర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటన కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు జిల్లా కలెక్టర్ శశాంక. అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు.
సీఎం కరీంనగర్ పర్యటనకు ఏర్పాట్లు
హరితహారం కార్యక్రమంలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలకు ఫ్రీ గార్డులను ఏర్పాటు చేయాలని డీఆర్డీఓను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఇంటివద్ద అంబులెన్స్, జనరేటర్ వాహనాలను సిద్ధంగా ఉంచాలని అధికారులకు సూచించారు.
ఇవీ చూడండి: మధ్య మానేరు ప్రాజెక్టు సందర్శనకు కేసీఆర్