కరీంనగర్ బస్టాండ్ పూర్తి స్థాయి సీసీ కెమెరాల నిఘాలో ఉండే విధంగా చర్యలు తీసుకున్నట్లు సీపీ కమలాసన్‌రెడ్డి తెలిపారు. కొత్తగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను సీపీ లాంఛనంగా ప్రారంభించారు. గతంలో ఉన్న సీసీ కెమెరాలు బస్టాండ్ ఆధునీకరణలో భాగంగా తొలగించగా.. కొత్త సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాల్సి వచ్చిందని చెప్పారు. బస్టాండ్ ఆవరణలో మొత్తం 60 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి దుకాణ యజమానులు సహకరించారని ఆయన పేర్కొన్నారు. ఒక్కో కెమెరా 30మంది పోలీసులతో సమానమని ప్రస్తుతం 60కెమెరాలు ఏర్పాటు చేసిన దృష్ట్యా నిరంతరం బస్టాండ్ ఆవరణలో 1,800 మంది పోలీసులు పహారా ఉన్నట్లని సీపీ పేర్కొన్నారు. కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసి 24గంటలు సీసీ కెమెరాలను పర్యవేక్షించే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు సీపీ కమలాసన్‌రెడ్డి వివరించారు.
సీసీ కెమెరాల నిఘాలో కరీంనగర్ బస్టాండ్ - సీసీ కెమెరాల నిఘాలో కరీంనగర్ బస్టాండ్
కరీంనగర్ బస్టాండ్‌లో కొత్తగా 60 సీసీ కెమెరాలను సీపీ కమలాసన్ రెడ్డి ప్రారంభించారు. వీటి ఏర్పాటులో సహకరించిన దుకాణ యజమానులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
నిఘాలో కరీంనగర్ బస్టాండ్