బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌కు హుజూరాబాద్ రాజకీయాలపై ఉన్న శ్రద్ధ.. రైతులపై లేదని జిల్లా భాజపా అధ్యక్షుడు గంగాడి కృష్ణా రెడ్డి అన్నారు. కరీంనగర్ రూరల్ మండలం నగునూర్‌లో అకాల వర్షాలతో పంట నష్టపోయిన ప్రాంతాలను, కొనుగోలు కేంద్రం వద్ద తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు.
అధికార పార్టీ నాయకులు పంట కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి.. చేతులు దులుపుకున్నారని విమర్శించారు. శుక్రవారం జిల్లాలోని చాలా ప్రాంతాల్లో వర్షం పడి ధాన్యం తడిసిందని చెప్పారు. మార్కెట్, ఐకేపీ కేంద్రాల నిర్వాహకుల నిర్లక్ష్యం, గన్నీ సంచుల కొరతతో ధాన్యం కొనుగోలు మందకొండిగా సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.