తెలంగాణ

telangana

ETV Bharat / state

'పుర ఎన్నికల్లో విజయం భాజపాదే..!' - 'పుర ఎన్నికల్లో విజయం భాజపాదే..!'

రాష్ట్రంలో జరగబోయే నగరపాలక ఎన్నికల్లో భాజపా గెలుపే లక్ష్యంగా పని చేస్తోందన్నారు భాజపా మహిళా మోర్చా అధ్యక్షురాలు ఆకుల విజయ. కరీంనగర్‌లో భాజపా నేత కొండయ్య నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.

'పుర ఎన్నికల్లో విజయం భాజపాదే..!'

By

Published : Aug 5, 2019, 9:19 AM IST

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భాజపాను బలోపేతం చేసేందుకు పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు చేపడుతున్నామని భాజపా మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు ఆకుల విజయ అన్నారు. కరీంనగర్‌ పట్టణంలోని గోదాంగడ్డలో కార్పొరేటర్ కొండయ్య నిర్వహించిన భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఇప్పటికే భారత దేశ వ్యాప్తంగా 18 లక్షల మంది సభ్యత్వ నమోదు చేసుకున్నారని ఆమె అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే నగరపాలక, పురపాలక సంస్థ ఎన్నికల్లో భాజపా కాషాయ జెండాను ఎగుర వేసే విధంగా కార్యకర్తలు కృషి చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

'పుర ఎన్నికల్లో విజయం భాజపాదే..!'

ABOUT THE AUTHOR

...view details