కరీంనగర్లోని సివిల్ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డులో విధులు నిర్వహించే సిబ్బందికి, డాక్టర్లకు సరైన రక్షణ చర్యలు, నాణ్యమైన మాస్కులు, గ్లౌజులు, యూనిఫామ్స్ లేకపోవడం పట్ల భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్డును సందర్శించి అక్కడి పరిస్థితిపై అధికారులను నిలదీశారు.
'డాక్టర్కే రక్షణ లేకపోతే... ఐసోలేషన్ వార్డులో ఎలా పనిచేస్తారు?' - కరోనా వైరస్ వార్తలు
ఐసోలేషన్ వార్డులో వైద్యం అందించే డాక్టర్లకే సరైనా మెడికల్ కిట్లు లేవంటూ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్లోని సివిల్ ఆస్పత్రిలో వసతులను ఆయన పరిశీలించారు.
'డాక్టర్కే రక్షణ లేకపోతే... ఐసోలేషన్ వార్డులో ఎలా పనిచేస్తారు?'
రెండు రోజుల క్రితం వచ్చినప్పుడు ఇదే పరిస్థితి ఉందని... ఇప్పటికీ మారకపోవడం ఏంటని ప్రశ్నించారు. కుటుంబాలకు దూరంగా ఉంటూ ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్న సిబ్బంది, డాక్టర్ల ఆరోగ్యంపై మీకు పట్టింపు లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. జిల్లా ఆస్పత్రిలో పరిస్థితులు బాగా లేవని, సిబ్బంది ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్నారంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వివరించారు.