కరీంనగర్ నగర పాలక సంస్థలో అభివృద్ధి కుంటు పడుతోంది. అందమైన భవనాలు, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండాల్సిన ప్రజలు మురికి కుంపల మధ్య జీవిస్తున్నారు. కరీంనగర్లోని సూర్యానగర్, బాలాజీనగర్లలోని భవనాల వద్ద మురుగు నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మురుగు కాల్వలు శుభ్రం చేయకపోవడం వల్ల నీరంతా రహదారులపైకి వచ్చి కంపు వాసన వస్తోందని కాలనీవాసులు వాపోతున్నారు.
మురికి కుంపగా కరీంనగరం.. ఇబ్బందుల్లో జనం... - lack of drainage system in karimnagar
స్మార్ట్ సిటీగా ఎంపికైన కరీంనగర్లో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండాల్సిన ప్రజలు మురికి కుంపల మధ్య బతుకీడుస్తున్నారు.

మురుగు కంపు మధ్య కరీంనగరం
నూతన గృహాలు నిర్మించే ముందు అనుమతి తీసుకోకపోతే ఇళ్లు కూడా కూల్చి వేస్తున్న అధికారులు నగరంలో కనీస అభివృద్ధి కూడా చేయడం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా నగరపాలక సంస్థ మేల్కొని మురుగు కాల్వలు సక్రమంగా నిర్మించి తమను వ్యాధుల బారి నుంచి కాపాడాలని కోరుతున్నారు.