లక్ష్య సాధనలో సవాళ్లను ఎదుర్కొనేందుకు.. యువతకు క్రీడలు ఉపకరిస్తాయని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో నిర్వహించిన వాలీబాల్ పోటీల్లో విజేతలుగా నిలిచిన జట్లకు ఆయన ట్రోఫీలు అందజేశారు.
ముగిసిన వాలీబాల్ పోటీలు.. విజేతగా సిరిసిల్ల జట్టు - mla sunke ravi shankar update
కరీంనగర్ జిల్లా చొప్పదండిలో నిర్వహించిన ఆహ్వానిత వాలీబాల్ పోటీలు ముగిశాయి. విజేతలకు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ట్రోఫీలు అందజేశారు.
ముగిసిన వాలీబాల్ పోటీలు.. విజేతగా సిరిసిల్ల జట్టు
మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించిన ఈ పోటీల్లో మొత్తం 32జట్లు పోటీ పడ్డాయి. ఫైనల్లో సిరిసిల్ల జట్టు విజేతగా, కోరుట్ల జట్టు రన్నర్స్‌గా నిలిచాయి.
ఇదీ చదవండి:మహారాష్ట్రలో భూకంపం- భవనాలకు పగుళ్లు