కాళేశ్వరం ప్రాజెక్టు రెండో దశలోని గాయత్రి పంప్‌హౌస్‌ను కరీంనగర్ జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో అన్ని శాఖల జిల్లా అధికారులు సందర్శించారు. రామడుగు మండలం లక్ష్మీపూర్‌లోని గాయత్రి పంప్‌హౌస్‌కు విచ్చేసిన అధికారులకు ఇంజినీర్ ఇన్ చీఫ్ నల్ల వెంకటేశ్వర్లు ఎత్తిపోతల నిర్మాణం పనులను పవర్‌పాయింట్ ద్వారా వివరించారు. 139 మెగావాట్ల విద్యుత్తు వినియోగించుకునే బాహుబలి పంపుసెట్ల పనితీరును తెలియజేశారు. బాహుబలి పంపుసెట్ల ప్రదేశంలో ఆధునిక సాంకేతిక వినియోగాన్ని అధికారులకు చూపించారు. నియంత్రణ వ్యవస్థ వద్దకు చేరుకొని బాహుబలి పంపులను నడిపే తీరు ఎల్సీడీ తెరపై ప్రదర్శించారు. కరీంనగర్ జిల్లాకు చెందిన అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు ఈ పర్యటనలో పాల్గొన్నారు. గాయత్రి పంప్‌హౌస్ ఇంజినీరింగ్ నిర్మాణాల్లోనే ఓ అద్భుతమని కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ కొనియాడారు. సాగునీటి రంగంలో ప్రపంచంలోనే అతి పెద్దదిగా పేరొందిన బాహుబలి పంపుసెట్లు నిర్మాణం కరీంనగర్ జిల్లాకు గర్వకారణమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం సకాలంలో పూర్తి చేసిన ఇంజినీరింగ్ అధికారుల కృషి ప్రశంసనీయమన్నారు సర్ఫరాజ్ అహ్మద్.
బాహుబలి పంపుల సందర్శనలో అన్ని శాఖల అధికారులు - KARIMANAGAR GOVERNMENT OFFICERS VISITED GAYATRI PUMP HOUSE
కరీంనగర్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న అన్ని శాఖల అధికారులు లక్ష్మీపూర్‌లోని గాయత్రి పంప్‌హౌస్‌ను సందర్శించారు. కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో ఈ పర్యటన చేపట్టారు. అధికారులకు ఇంజినీర్ ఇన్ చీఫ్ పంపుల పనితీరు వివరించారు.
KARIMANAGAR GOVERNMENT OFFICERS VISITED GAYATRI PUMP HOUSE