కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో జిల్లా కలెక్టర్ శశాంక పర్యటించారు. మండంలంలోని తాడికల్, మక్తా, కాచాపూర్, కన్నాపూర్, గద్దపాక గ్రామాలను సందర్శించారు. ఆయా గ్రామాల్లో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో పాల్గొని.. మొక్కలు నాటారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యులు కావాలని కలెక్టర్ సూచించారు.
'పల్లెలను హరితవనాలుగా మార్చేందుకు ప్రతిఒక్కరూ కలిసిరావాలి' - 6th phase of haritha haaram
ప్రతీ పౌరుడు మొక్కలు నాటి... గ్రామాలను హరితవనాలుగా తయారుచేయాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ శశాంక తెలిపారు. శంకరపట్నం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించిన కలెక్టర్... హరితహారంలో భాగంగా గ్రామస్థులతో కలిసి మొక్కలు నాటారు.
'ప్రతీ ఒక్కరు మొక్కలు నాటి గ్రామాలను హరితవనాలు తీర్చిదిద్దాలి'
ప్రతీ పౌరుడు మొక్కలు నాటి... గ్రామాలను హరితవనాలుగా తయారు చేయాలని కోరారు. గ్రామాల్లో నిర్వహిస్తున్న నర్సరీలను తనిఖీ చేశారు. మొక్కల పెంపకం తీరును పరిశీలించారు. ప్రజాప్రతినిధులతో మాట్లాడి... కార్యక్రమ వివరాలు అడిగి తెలుసుకున్నారు.