కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రెండవ డిపోలో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని రెండు డిపోల పరిధిలోని ఆర్టీసీ సిబ్బంది హరితహారంలో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన ఉమ్మడి జిల్లా ఆర్టీసీ రీజనల్ మేనేజర్ జీవన్ ప్రసాద్ బస్టాండ్ ఆవరణలో మొక్కలు నాటారు.
కరీంనగర్ డిపోలో మొక్కలు నాటిన రీజనల్ మేనేజర్ - హరితహారం వార్తలు
పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావాలని కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఆర్టీసీ రీజనల్ మేనేజర్ జీవన్ ప్రసాద్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని రెండవ డిపోలో ఏర్పాటు చేసిన హరితహారంలో ఆయన పాల్గొన్నారు.
కరీంనగర్ డిపోలో మొక్కలు నాటిన రీజనల్ మేనేజర్
కరీంనగర్ రీజియన్ పరిధిలోని బస్టాండ్ ఆవరణలోని ఖాళీ ప్రదేశంలో ఐదువేల మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆయన తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో పౌరులందరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. మొక్కలు నాటడమే కాకుండా.. వాటి సంరక్షణ బాధ్యత కూడా తీసుకోవాలని కోరారు.