కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండన్నపల్లికి చెందిన ఉప్పు ఆదిత్య జాతీయ సేవా పథకంలో పురస్కారానికి ఎంపికయ్యారు. కేంద్ర యువజన వ్యవహారాల శాఖ మంత్రి కార్యాలయం నుంచి ఈ మేరకు ఆదిత్య సమాచారం అందుకున్నారు. శాతవాహన విశ్వ విద్యాలయం నిర్వహించిన సేవా, రక్తదాన శిబిరాల్లో ఆదిత్య చురుగ్గా పాల్గొన్నారు. గ్రామీణ సాంస్కృతిక ఉత్సవాలు, సామాజిక కార్యక్రమాలు నిర్వహించిన ఆదిత్యను కేంద్ర యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ జాతీయ సేవా పురస్కారానికి ఎంపిక చేసింది. సెప్టెంబర్ 24న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వీడియో కాన్ఫరెన్సులో 30 మందికి ఈ పురస్కారాలను అందించనున్నారు. తెలంగాణ నుంచి జాతీయ స్థాయి పురస్కారానికి ఎంపికైన ఇద్దరిలో ఉప్పు ఆదిత్య ఒకరు.
కరీంనగర్ యువకుడికి.. జాతీయ సేవా పురస్కారం!
పాఠశాల స్థాయి నుంచే సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ.. సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే ఉప్పు ఆదిత్యను కేంద్ర యువజన వ్యవహారాల శాఖ జాతీయ స్థాయి పురస్కారానికి ఎంపిక చేసింది. జాతీయ సేవా పథకం ఆవిర్భావ దినోత్సవమైన సెప్టెంబర్ 24న ఆదిత్య ఈ అవార్డు అందుకోనున్నారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ 30మంది గ్రహీతలను వీడియో కాన్ఫరెన్సులో అభినందించి పురస్కారాలు అందిస్తారు.
కరీంనగర్ యువకుడికి.. జాతీయ సేవా పురస్కారం!
ఇవీ చూడండి : లోక్సభలో బిల్లుల ఆమోదమే కాదు సమస్యలపై చర్చ జరగాలి : నామా