కరీంనగర్లో అక్రమంగా తరలిస్తున్న రూ. 10 లక్షలు విలువ చేసే.. నిషేధిత గడ్డిమందును టాస్క్‌ఫోర్స్ పోలీసులు కరీంనగర్ నాకా చౌరస్తాలో పట్టుకున్నారు. కరీంనగర్ మూడవ పట్టణ పోలీసులకు వచ్చిన సమాచారం ప్రకారం మంచిర్యాల జిల్లాకు చెందిన దుంప సదాశివం, సిద్ధిపేట జిల్లాకు గజ్వేల్‌కు చెందిన గునుకుల సునీల్, కరీంనగర్ పట్టణానికి చెందిన బంగారి కార్తీక్‌లు బృందంగా ఏర్పడి నిషేధిత గడ్డిమందు వ్యాపారం చేస్తున్నారు.
రూ.10 లక్షల విలువ చేసే నిషేధిత గడ్డిమందు స్వాధీనం - కరీంనగర్ పోలీసులు
నిషేధంలో ఉన్న గడ్డిమందును అక్రమంగా సరఫరా చేస్తున్నారన్నా సమాచారం అందుకున్న కరీంనగర్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మెరుపుదాడి చేసి పట్టుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకొని.. రూ.10 లక్షల విలువ చేసే.. నిషేధిత గడ్డిమందును స్వాధీనం చేసుకున్నారు.
కరీంనగర్ నాకా చౌరస్తాలో నిషేధిత గడ్డిమందు డబ్బాలను ఎగుమతి చేయడానికి సిద్ధమవుతుండగా.. టాస్క్‌ఫోర్స్ పోలీసులు మెరుపుదాడి చేసి నిందితును అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో పోలీసులు విచారణ చేయగా.. వరంగల్ జిల్లా మట్వాడాకు చెందిన ఏరుకుల వేదప్రకాష్, కరీంనగర్ పట్టణానికి చెందిన శ్రీనివాస్‌లు కరీంనగర్‌కు చెందిన వాసవి ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపుతున్నట్టు చెప్పారు. నిందితుల వద్ద నుంచి 200 లీటర్ల నిషేధిత గడ్డి మందును స్వాధీనం చేసుకున్న పోలీసులు సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
ఇదీ చూడండి:విదేశీ యాప్‌లకు ప్రత్యామ్నాయంగా 'ఎలిమెంట్స్'