తెలంగాణ

telangana

ETV Bharat / state

అక్టోబర్ 15లోగా.. చీరలు పంచాలి : కలెక్టర్ శశాంక

ఈ నెల 15వ తేదీ లోగా.. బతుకమ్మ చీరలు మహిళలకు పంచేయాలని.. కరీంనగర్​ కలెక్టర్ శశాంక జిల్లా స్థాయి అధికారులను ఆదేశించారు. చీరల పంపిణీపై అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. 18 సంవత్సరాలు పైబడిన అర్హత గల వారందరికీ బతుకమ్మ చీరలు పంచాలని ఆదేశించారు. కుల, మతాలకతీతంగా రాష్ట్ర ప్రభుత్వం అందరికీ చీరలు పంపిణీ చేస్తుందని తెలిపారు.

Karim nagar Order To Distributes Bathukamma Sarees Before october 15th
అక్టోబర్ 15లోగా.. చీరలు పంచాలి : కలెక్టర్ శశాంక

By

Published : Oct 6, 2020, 9:59 AM IST

గ్రామాల్లో బతుకమ్మ చీరలు పంపిణీ చేయడానికి బృందాలను ఏర్పాటు చేయాలని కరీంనగర్​ జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు. చీరలు పంచే బృందంలో పంచాయతి సెక్రటరీ, మహిళా సంఘాలు, రేషన్ షాపు డీలర్లు ఉంటారని.. పట్టణాలు, మున్సిపాలిటీల పరిధిలో సంబంధిత వార్డు మెంబర్, బిల్ కలెక్టర్, మహిళా సంఘాల సభ్యులు, రేషన్ షాపు డీలర్ల ద్వారా పంపిణీ చేయాలన్నారు. కొవిడ్ కారణంగా అక్టోబర్ 9, 10, 11 వ తేదీలలో ఇళ్లకు వెళ్లి పంపిణీ చేయాలని.. 11 తర్వాత రేషన్ షాపులో బతుకమ్మ చీరలు పంపిణీ చేయాలన్నారు. 18 సంవత్సరాలు పైబడిన అర్హత గల వారందరికీ బతుకమ్మ చీరలు పంచాలని ఆదేశించారు.

జిల్లాలో మొత్తం 3 లక్షల 10 వేల బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. కొవిడ్ కారణంగా చీరలు పంపిణీ చేసే డీలర్లు నిబంధనలు పాటిస్తూ మాస్కులు, శానిటైజర్ వాడాలని సూచించారు. బతుకమ్మ పండుగ సందర్భంగా 18 సంవత్సరాలు దాటిన మహిళలకు కుల, మతాలకతీతంగా రాష్ట్ర ప్రభుత్వం అందరికీ చీరలు పంపిణీ చేస్తుందని తెలిపారు. చీరల పంపిణీ సమయంలో లబ్దిదారులు అహార భద్రత కార్డులు, ఆధార్ కార్డు లేదా ఇతర ఏదేని గుర్తింపు కార్డులను తప్పకుండా వెంట తీసుకుని రావాలని, వారికే చీరలు ఇచ్చి సంతకాలు తీసుకోవాలని కలెక్టర్ శశాంక అధికారులకు సూచించారు.

ఇదీ చదవండి:సామాన్య మహిళల అసామాన్య పోరాటం

ABOUT THE AUTHOR

...view details