లాక్డౌన్లో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న పేద బ్రాహ్మణులకు కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి నిత్యావసర సరుకులు పంచారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటి వరకు పోలీసుల తరఫున 2,250 మందికి నిత్యావసరాలు పంచినట్టు సీపీ కమలాసన్ రెడ్డి తెలిపారు.
పేద బ్రాహ్మణులకు సరుకులు పంచిన కరీంనగర్ సీపీ - పేద బ్రాహ్మణులకు సరుకులు పంచిన కరీంనగర్ సీపీ
కేసులు, నేరాల విషయంలో కఠినంగా ప్రవర్తించడమే కాదు.. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం, ఆపన్నులకు స్నేహహస్తం అందించడంలో పోలీసులు ఎప్పుడూ ముందే ఉంటారని నిరూపించారు కరీంనగర్ పోలీసులు.
పేద బ్రాహ్మణులకు సరుకులు పంచిన కరీంనగర్ సీపీ
లాక్డౌన్ వల్ల ఆలయాలు మూతపడి, శుభకార్యాలు జరగక ఇబ్బందులు పడుతున్న పేద బ్రాహ్మణులకు నిత్యావసరాలు పంచారు. కేవలం పౌరోహిత్యం మీదనే ఆధారపడి ఉపాధి లేక తిండికి ఇబ్బంది పడుతున్న 75 మంది పేద బ్రాహ్మణులకు సీపీ నిత్యావసరాలు పంచారు. దాతల సహాయంతో మరింతమందికి సాయం చేయనున్నట్టు సీపీ కమలాసన్ రెడ్డి తెలిపారు.