కరీంనగర్ జిల్లా జమ్మికుంట పురపాలికలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను జిల్లాపరిషత్ ఛైర్మన్ కనుమల్ల విజయ అందజేశారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మండలంలోని 14 గ్రామాలకు చెందిన 77 మంది లబ్ధిదారులకు 76.60 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు.
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ - కరీంనగర్ జిల్లా జమ్మికుంట పురపాలిక వార్తలు
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పురపాలికలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లాపరిషత్ ఛైర్మన్ కనుమల్ల విజయ ముఖ్యఅతిథిగా హాజరై లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఆమె వ్యాఖ్యానించారు.
కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ల చెక్కుల పంపిణీ
పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఆమె అన్నారు. ఈ పథకాలు నిరుపేదలకు ఓ వరం లాంటివన్నారు. ఈ కార్యక్రమంలో పురపాలిక ఛైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.