కరీంనగర్ జిల్లా చొప్పదండిలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్.. 53 మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు రూ. 53 లక్షల 6వేల 148 విలువ చేసే చెక్కులను అందజేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఆడపిల్లల తల్లిదండ్రులకు పెళ్లి ఖర్చు భారం కాకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా బాల్య వివాహాలు నిలిచి పోయాయని వెల్లడించారు.
'సంక్షేమ పథకాల అమలులో అగ్రగామిగా తెలంగాణ' - kalyana lakshmi cheques distribution in choppadandi
కరీంనగర్ జిల్లా చొప్పదండిలో 53 మంది కల్యాణ లక్ష్మి లబ్ధిదారులకు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ చెక్కులను అందజేశారు. కరోనా సంక్షోభ సమయంలోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాల అమలుకే ప్రాధాన్యత ఇచ్చారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
కరీంనగర్, కల్యాణ లక్ష్మి, చొప్పదండి
కరోనా సంక్షోభ సమయంలోనూ సంక్షేమ పథకాల అమలుకే సీఎం ప్రాధాన్యత ఇచ్చారని రవిశంకర్ గుర్తు చేశారు. దేశ వ్యాప్తంగా పథకాల అమలులో తెలంగాణ అగ్రగామిగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు.
ఇదీ చదవండి:లక్ష్యసాధనలో ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నాం : నాబార్డ్ చీఫ్