కాళేశ్వరం ప్రాజెక్టులోని గాయత్రి పంప్‌హౌస్‌లో ఆరు బాహుబలి పంపులతో ఎత్తిపోతలు చేపట్టారు. పంప్‌హౌస్ నుంచి సుమారు 20 వేల క్యూసెక్కుల గోదావరి జలాలు ఎస్సారెస్పీ వరదకాలువలోకి తరలివెళ్తున్నాయి. భారీ ప్రవాహంతో ఎత్తిపోతల జలాలు శ్రీరాములపల్లి జంక్షన్ పాయింట్ నుంచి రెండు వైపులా ప్రవహిస్తున్నాయి. దిగువన మధ్యమానేరు ప్రాజెక్టుకు, ఎగువ వైపు శ్రీరాంసాగర్ పునరుజ్జీవ పథకానికి ఎత్తిపోతలకు జలాలు తరలివెళ్తున్నాయి. గాయత్రి పంప్‌హౌస్ నుంచి సుమారు ఆరు కిలో మీటర్ల మేర గల గ్రావిటీ కాలువ నిండుగా ప్రవహిస్తోంది. తాజా ఎత్తిపోతలతో రోజుకు సుమారు రెండు టీఎంసీల నీటిని తరలిస్తున్నారు.
మల్యాల:రాంపూర్ పంప్‌హౌస్‌లో శనివారం అధికారులు మరో రెండు మోటార్లు ప్రారంభించారు. శుక్రవారం సాయంత్రం ఒక మోటారును ప్రారంభించారు. మూడు మోటార్ల ద్వారా ప్రతి రోజు 0.375 టీఎంసీల నీటిని వరద కాలువలోకి పంపిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇబ్రహీంపట్నం:ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకంలో భాగంగా రాజేశ్వర్‌రావుపేట్ వరద కాలువ వద్ద నిర్మించిన రివర్స్ పంపుహౌస్ నుంచి నీటి ఎత్తిపోతలను అధికారులు ప్రారంభించారు. శనివారం సాయంత్రం ఒక మోటారుతో 1400 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోశారు. రాత్రి రెండో మోటారు ద్వారా ఎత్తిపోయన్నుట్లు ఈఈ సుధాకిరణ్ తెలిపారు.