కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని నారాయణపూర్ ఎత్తిపోతల పథకం గోదావరి నీటితో కళకళలాడుతోంది. సాగునీటి కోసం ఆశగా ఎదురుచూస్తున్నరైతులు.. బిరబిరా గోదావరి జలాలు తరలివస్తుంటే ఆనందం వ్యక్తం చేశారు.
నారాయణపూర్ చేరిన కాళేశ్వరం జలాలు - కరీంనగర్ జిల్లా లేటెస్ట్ వార్తలు
నారాయణపూర్ ఎత్తిపోతల పథకం గోదావరి నీటితో కళకళలాడుతోంది. సాగునీటి కోసం ఆశగా ఎదురుచూస్తున్న కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని రైతులు నీరు రావటంతో ఆనందం వ్యక్తం చేశారు.
నారాయణపూర్ చేరిన కాళేశ్వరం జలాలు
నారాయణపూర్ చెరువు నింపిన తర్వాత కొడిమ్యాలలోని మైసమ్మ చెరువు, ఫాజిల్‌నగర్ చెరువును నింపాలనే ఉద్దేశంతో గోదావరి జలాలను నారాయణపూర్‌కు రప్పిస్తున్నారు. ఎల్లంపల్లి నుంచి నందిమేడారం అక్కడి నుంచి నేరుగా పైప్‌లైన్ ద్వారా నారాయణపూర్‌కు నీళ్లు చేరుకుంటున్నాయి.
ఇదీ చదవండి:ప్రగతిశీల రాష్ట్రంగా తెలంగాణ: గవర్నర్