కరీంనగర్ జిల్లా రేవల్లిలో ఎస్సారెస్పీ కాలువ ఒకవైపు లైనింగ్ శిథిలమై ప్రమాదకరంగా మారింది. ఎస్సారెస్పీ నీరు విడుదల చేస్తే ప్రవాహ వేగానికి మట్టి కొట్టుకు పోయి దిగువ ప్రాంతాలు జలమయంగా మారే ప్రమాదం ఉంది. ఇక్కడి నుంచే కాకతీయ కాలువ నేరుగా దిగువ మానేరు జలాశయంలోకి కలుస్తోంది. వర్షాకాలానికి ముందే అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
శిథిలావస్థకు చేరిన కాకతీయ కాలువ
ఎస్సారెస్పీ కాకతీయ కాలువ లైనింగ్ కొట్టుకుపోయి శిథిలావస్థకు చేరుకుంది. కరీంనగర్ జిల్లాలో రేవల్లి నుంచి చొప్పదండి వరకూ నాలుగు కిలోమీటర్ల మేర అక్కడక్కడ సిమెంటు కొట్టుకుపోయి నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారింది.
శిథిలావస్థకు చేరిన కాకతీయ కాలువ