కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లోని వాగేశ్వరి ఇంజినీరింగ్ కళాశాలలో జేఎన్టీయూహెచ్ స్థాయి జూడో పోటీలు నిర్వహించారు. సంస్థ కార్యదర్శి దిలీప్ ముఖ్యఅతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా జేఎన్టీయూహెచ్ పరిధిలో ఉన్న అన్ని కళాశాలల్లో ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారితో రాష్ట్రస్థాయి జట్టు తయారుచేసి... కాన్పూర్లోని బరేలీ యూనివర్సిటీలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు పంపించనున్నట్లు తెలిపారు.
వాగేశ్వరి కళాశాలలో జూడో క్రీడాకారుల ఎంపిక పోటీలు - judo selections in vageshwari engineering college
జేఎన్టీయూహెచ్ పరిధిలోని ఇంజినీరింగ్ కళాశాలలకు చెందిన విద్యార్థులకు జూడో పోటీలు నిర్వహించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్రస్థాయి జట్టుకు ఎంపిక చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
వాగేశ్వరి కళాశాలలో జూడో ఎంపిక పోటీలు
TAGGED:
judo selections