తెలంగాణ

telangana

ETV Bharat / state

JP NADDA About Bandi Sanjay Deeksha: 'కేసులు పెట్టారని భయపడొద్దు.. మీ పోరాటం అమోఘం' - bandi sanjay deeksha on go 317

JP NADDA About Bandi Sanjay Deeksha: జీవో 317 కు వ్యతిరేకంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ చేస్తున్న పోరాటం అమోఘమని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ఈ మేరకు బండి సంజయ్​ను ఫోన్​లో పరామర్శించారు. పోరాటంలో ముందుకెళ్లాలని సూచించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ చర్యలను ఖండిస్తూ ట్విటర్​ ద్వారా వీడియో విడుదల చేశారు.

JP NADDA About Bandi Sanjay Deeksha
బండి సంజయ్​కు జేపీ నడ్డా పరామర్శ

By

Published : Jan 3, 2022, 1:50 PM IST

Updated : Jan 3, 2022, 3:07 PM IST

JP NADDA About Bandi Sanjay Deeksha: రాష్ట్రంలో పార్టీ గెలుపును ఓర్వలేకనే కేసీఆర్‌ సర్కారు.. కార్యకర్తలపై దాడులకు పాల్పడుతోందని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. కేసీఆర్‌ ప్రభుత్వం ఎన్ని ఒత్తిళ్లకు గురిచేసినా ప్రజాసమస్యలపై పోరు ఆగదని స్పష్టం చేశారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్​ అరెస్టును ఆయన ఖండించారు. ఈ మేరకు బండి సంజయ్‌తో జేపీ నడ్డా ఫోన్‌లో మాట్లాడారు.

పోరాటం ఆగదు

మొన్నటి వరకు రైతుల సమస్యలపై బండి సంజయ్​ పోరాటం చేశారన్న జేపీ నడ్డా.. జీవో 317 పై ఆయన పోరాటం అమోఘమని కొనియాడారు. కేసులు పెట్టారని భయపడొద్దని బండి సంజయ్‌కు చెప్పారు. పోరాటంలో ముందుకెళ్లాలని సూచించారు. కేసీఆర్‌ సర్కారును న్యాయపరంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. కేసీఆర్​ సర్కారు చర్యలను తీవ్రంగా ఖండిస్తూ ట్విట్టర్​ ద్వారా వీడియో విడుదల చేశారు.

ప్రజాస్వామ్యం ఖూనీ

కొవిడ్​ నిబంధనలకు అనుగుణంగా నిన్న కరీంనగర్​లోని భాజపా కార్యాలయంలో బండి సంజయ్​ ఉపవాస దీక్ష చేపట్టారు. కానీ తెలంగాణ పోలీసులు వెళ్లి కార్యాలయ షెట్టర్లు ధ్వంసం చేసి లోపలికి చొరబడ్డారు. కార్యకర్తలపై లాఠీఛార్జి, భౌతిక దాడులకు పాల్పడి బండి సంజయ్‌ను అరెస్ట్ చేశారు. ఇది సరికాదు, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే. కేసీఆర్‌ సర్కారు వినాశకాలానికి, విపరీత బుద్ధికి ఇది నిదర్శనం. భాజపా కార్యకర్తలంతా ఐక్యంగా ఉపాధ్యాయుల తరఫున, ప్రజా సమస్యలపై పోరాడతారు. ఈ పోరులో న్యాయమే గెలుస్తుంది. కేసీఆర్‌ ప్రభుత్వం తీరుపై అన్ని ఆధారాలతో ప్రజాస్వామ్యయుతంగా.. న్యాయపరంగా పోరాటం చేస్తాం.

- జేపీ నడ్డా, భాజపా జాతీయ అధ్యక్షుడు

నాన్​బెయిలబుల్​ కేసు

Bandi Sanjay Arrest:రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ బదిలీల కోసం విడుదల చేసిన.. జీవో 317ను సవరించాలని డిమాండ్‌ చేస్తూ భాజపా చేపట్టిన జాగరణ దీక్షను.. పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. ఆదివారం రాత్రి కరీంనగర్‌లోని ఎంపీ కార్యాలయం వద్ద బండి సంజయ్‌ తలపెట్టిన దీక్షకు అనుమతిలేదని పోలీసులు అడ్డుకున్నారు. ఆంక్షలను తప్పించుకొని.. కార్యాలయంలోకి వెళ్లి సంజయ్‌ దీక్ష చేపట్టగా, పోలీసులు తలుపులు పగులగొట్టి.. ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, భాజపా కార్యకర్తల మధ్య.. తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. భాజపా కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జీ చేశారు. సంజయ్​పై నాన్​ బెయిల​బుల్ కేసు నమోదు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఆయనను కరీంనగర్​ కోర్టుకు తరలించారు.

ఇదీ చదవండి:Bandi Sanjay Arrest Updates : కరీంనగర్ కోర్టుకు బండి సంజయ్ తరలింపు

Last Updated : Jan 3, 2022, 3:07 PM IST

ABOUT THE AUTHOR

...view details